యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో క్షేత్ర పర్యటన మరియు శాసనాల పరిశీలన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మధిర నందు యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో క్షేత్ర పర్యటనలో భాగంగా మడుపల్లి గ్రామ శివాలయాన్ని సందర్శించడం జరిగింది. క్రీస్తుశకం 11వ శతాబ్దానికి చెందిన తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు ఇక్కడ తను సాధించిన విజయానికి గుర్తుగా శివాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ ఉన్న శివుణ్ణి రాజరాజ నరేంద్ర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ శివలింగం బ్రహ్మ సూత్రం కలిగినది మరియు త్రివిధ నందులతో పాటు విజయ స్తంభం పాతి ఉంది. ధ్వజస్తంభం పక్కన గల నందీశ్వరునిపై బ్రహ్మీ లిపిలో శాసనము, సూర్యచంద్రుల గుర్తులు చెక్కి ఉన్నాయి. గర్భగుడి చుట్టూ రాతి గోడల పై వివిధ జంతువుల గుర్తులు చెక్కి ఉన్నాయి. వీటన్నిటిని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పరిశీలించి రికార్డు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రవీంద్రారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జి. అరుణ, యువటూరిజం క్లబ్ కోఆర్డినేటర్ డా.ఎస్. ఇందిర, అధ్యాపకులు నాగరాణి, శివకుమారి, షేక్ అఫ్రోజ్ , సురేష్ పాల్గొన్నారు.
© Copyright @2023 | Designed by National Informatics Centre